టాస్క్ శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం 

టాస్క్ శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం 

విశ్వంభర, మహబూబాబాద్ : తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని డిగ్రీ కళాశాల  వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.సిహెచ్ శ్రీనివాసులు చెప్పారు. స్టూడెంట్స్ లో నైపుణ్యాల అభివృద్ధికి, పోటీ పరీక్షలతో పాటు ఉద్యోగాల సమపార్జనలో ఉపయుక్తంగా ఉంటుందని ఆకాంక్షించారు . జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్ర రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం రోజున  ముగిసింది. దీనికి టాస్క్ రిసోర్స్ పర్సన్ జె. రాజేష్  ప్రధాన వక్తగా వ్యవహరించారు . ఈ శిక్షణలో అంక గణిత తార్కికం, ఆప్టిట్యూడ్  అంశాలపై విస్తృతంగా శిక్షణ అందించారు. విద్యార్థులకు, ప్రాథమిక సూత్రాలు సమస్యల పరిష్కార పద్ధతులు వేగవంతమైన గణన విధానాలు, షార్ట్ కట్ టెక్నిక్స్ వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అదనంగా వివిధ పోటీ పరీక్షల్లో వచ్చే నమూనా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయించారు . ముగింపు సమావేశంలో  వైస్ .ప్రిన్సిపాల్  శ్రీనివాసులు  శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని సూచించారు . కెరీర్ గైడెన్స్ సమన్వయకర్త డా.బి ఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకింగ్, ఎస్ఎస్సి గ్రూప్స్ ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందన్నారు . ఈ కార్యక్రమంలో టాస్క్ మేనేజర్, ప్రతినిధులు,  రామకృషన్, డి ఎస్ రామన్న,డా.ఎస్ కే ఖాసింషా, అనిల్ కుమార్ , అధ్యాపకులు బి శ్రీనివాస్,ఏ అన్నపూర్ణ, డా.డి రాజశేఖర్ , డా.బి హాతిరామ్,యం.సుమన్,డా.కే సుమలత, డా.పి ఉపేందర్,ఎం సంతోష్ కుమార్,జి యాకయ్య,ఉదయ్ కుమార్,యన్ నరేష్ విద్యార్థులు  పాల్గొన్నారు .WhatsApp Image 2026-04-07 at 6.44.25 PM (2)

Tags: