ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలి 

ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలి 

  • కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

 విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో వేసవిలో తాగు  నీటి  ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం వి సి కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో వివిధ శాఖల పనితీరు, చేపట్టవలసిన పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కు అధికారులు  రబీ 2025–26 సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలులో  భాగంగా  ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 280   సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, వీటిలో దాదాపు అన్ని సెంటర్లు ప్రారంభించి, ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిపిసి సెంటర్ ఇన్‌చార్జిలకు సూచిస్తూ, ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని రకాల సామగ్రిని టీపీ సెంటర్లలో సిద్ధంగా ఉంచుకోవాలని, కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాల న్నారు. జిల్లాలోని అన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. ఉపాధి హామీ పథకం పనుల  గురించి మాట్లాడుతూ గ్రామపంచాయితీలలో సరాసరి 100 మంది కూలీలతో  పనిచేయించాలని . ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీల అందరికీ హాజరు తీసుకోవాలని. నర్సరీలకు షేడ్ నెట్ లు ఏర్పాటు చేయాలని, అన్నీ రకాల రిజిస్టర్లు నిర్వహించాలని, ముఖ్యంగా నీటి సంరక్షణ పనులు గుర్తించాలి అని ఆదేశించారు.  జిల్లాలో  తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు కలిగితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అన్నారు అలాగే  ఎఫ్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలని,  బి ఎల్ ఓ వెరిఫై చేసి మ్యాపింగ్ ప్రోగ్రాం చేయాలని, బూత్ లెవెల్ ఏజెన్సీలను నియమించాలని, ఫారం పెండెన్సీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
 ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిఎస్ఓ మోహన్ బాబు, సిపిఓ కిషన్, డిపిఓ యాదగిరి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: