ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం కోడె బండ తండా కి చెందిన లబ్ధి దారుల భూక్యా బిక్షం, రోజా నూతన ఇందిరమ్మ ఇళ్లను శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర సంవత్సరాలలో మన మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చాము అని అన్నారు. అతిత్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో కూడా 2500 ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నాము అని అన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి కమిషన్ ల కోసం రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసింది అని అన్నారు.. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి ఆశీర్వాదాలు అందుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



