కుట్రతో నాపై కేసు పెట్టారు: కార్పొరేటర్​ మఠం పవన్​

కుట్రతో నాపై కేసు పెట్టారు: కార్పొరేటర్​ మఠం పవన్​

విశ్వంభర, నిజామాబాద్ : కుట్రతోనే నాపై తప్పుడు కేసు బనాయించారని 8వ డివిజన్​ బీజేపీ  కార్పొరేషన్​ మఠం పవన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందన్నారు. ఆ ప్రచారానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ బిల్డర్​ దగ్గర తాను డబ్బులు వసూలు చేయలేదన్నారు. కావాలనే కుట్రపన్ని తనపై కేసు బనాయించారని ఆయన పేర్కొన్నారు. బిల్డర్స్​​ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాల రమేశ్​, మాజీ కార్పొరేటర్​ సదానంద్​, మరో వ్యక్తి కలిసి తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ విషయమై  5వ టౌన్​ ఎస్సై తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజమన్నారు. న్యాల్​కల్​ రోడ్​లోని మున్సిపల్​ స్థలాన్ని బిల్డర్​ అసోసియేషన్​లోని కొందరు, కాంగ్రెస్​ లీడర్లు కబ్జా చేశారని, ఈ విషయాన్ని మున్సిపల్​ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయంపై కక్షకట్టిన సదరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని చెప్పారు

Tags: