ఉత్తమ అవార్డు అందుకున్న ప్రాథమిక సెంటర్
విశ్వంభర, మహబూబాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించినందుకు కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కామారం సబ్ సెంటర్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్త్ , చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డు, గర్భిణీ స్త్రీల ముందస్తు నమోదు , నాలుగు తప్పనిసరి పరీక్షలు, పూర్తి రోగనిరోధక టీకాలు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కామారం సబ్ సెంటర్ చూపిన విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా లభించింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్, మహబూబాబాద్ కామారం సబ్ సెంటర్ సిబ్బందిని అభినందించి, వారి కృషి ఇతర ఆరోగ్య కేంద్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తల్లి-శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో సిబ్బంది నిబద్ధత ప్రశంసనీయమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ఆశా కార్యకర్తలు, సంబంధిత సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.



