ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం
విశ్వంభర, నెల్లికుదురు: ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం విద్యార్థులకు జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు లోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ లో పాఠ్యాంశాలతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ఒకేషనల్ ఎడ్యుకేషన్ అమలు లో భాగంగా రిటైల్, అపరెల్ కోర్సులు అందిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన స్టూడెంట్స్కు ప్రాక్టికల్ శిక్షణ –10 రోజుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యాపార నిర్వహణ, కస్టమర్ సేవలు, విక్రయ నైపుణ్యాలు, వస్త్రాల తయారీ, డిజైనింగ్ వంటి అంశాలలో విద్యార్థులు అనుభవాన్ని పొందుతున్నారు. ప్రిన్సిపాల్ ఇంటర్న్ షిప్ విద్యార్థుల వద్దకు వెళ్లి, వారి పనితీరును నేరుగా పరిశీలించారు. వారితో మాట్లాడారు. మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో స్వయం ఉపాధి, ఉద్యోగాలు పొందేలాఈ ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



