ఉపాధ్యాయ దంపతులకు సన్మానం
On
విశ్వంభర, మహాదేవపూర్: మేడారం జాతరలో దొరికిన సుమారు 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న వారికి అప్పగించిన ఉపాధ్యాయ దంపతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో వార్డ్ సబ్యుభ్యులు సన్మానించారు. మేడారం జాతర లో దర్శన సమయం లో వారికి దొరికిన మూడున్నర తులాల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న వారికి తిరిగి ఇచ్చి వారి గొప్ప మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సబ్యులు పడాల రాజమౌళి, గడ్డం స్వామి, చీర్లవంచ చంద్రశేఖర్, కొండపల్లి రాములు, మహ్మద్ బిన్ అలీ, ఎండి నయీం , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ఉపాద్యాయులు మడక మధు, తదితరులు పాల్గొన్నారు.



