కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి 

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి 

  •  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పరిగి మున్సిపాలిటీలోని నస్కల్ గ్రామం 1వ వార్డులో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దండు శోభారాణి అశోక్  స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. నస్కల్ గ్రామంలో ఎమ్మెల్యే కి మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో 1వ వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు పార్థసారథి పంతులు, శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం శశికళ ఆనందం, వెంకటేష్, ప్రేమలత, ప్రేమ్, రత్నం, తదితరులు పాల్గొన్నారు.

Tags: