పేదింటి వధువుకు పుస్తెమట్టెలు అందజేత

పేదింటి వధువుకు పుస్తెమట్టెలు అందజేత

విశ్వంభర, సిద్దిపేట: రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన మణెమ్మ-భూదయ్య దంపతుల కుమార్తె జయశ్రీ వివాహానికి సిద్దిపేట పట్టణానికి చెందిన 38వ వార్డు మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు ధర్మవరం స్వప్న-బ్రహ్మం శనివారం పుస్తెమట్టెలను అందజేసి సహృదయాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మం మాట్లాడుతూ పేద ఆడపిల్లల వివాహాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. సమాజ సేవలో భాగంగా అవసరమైన వారికి చేయూత అందించడం తమ బాధ్యతగా భావిస్తామన్నారు. పేదలకు సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని చెప్పారు. మున్ముందు కూడా అర్హులైన నిరుపేదలకు సహాయసహకారాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం మణెమ్మ-భూదయ్య దంపతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pusthematte-is-given-to-the-poor-bride/article-15167

Tags: