పటాన్‌చెరులో జోనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
- అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: నారాయణ అమిత్
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ నూతన జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా స్థానిక ప్రాచీన కట్టడమైన గుమ్మటం పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీలలో భాగంగా గుమ్మటం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనులను పర్యవేక్షించి, పురాతన కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతం సాకి చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్ నిర్వహణను పరిశీలించిన కమిషనర్, చెత్త సేకరణ మరియు తరలింపులో ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధి పనులన్నీ నాణ్యతతో కూడి ఉండాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ నారాయణ అమిత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చెరువుల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమాల్లో డీఈ కృష్ణవేణి, జీహెచ్‌ఎంసీ విభాగపు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.