పంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణ
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికయిన వార్డు మెంబర్లకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల గురించి ఉపాధి హామీ ఏపిఓ బి రమేష్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పాల్గొన్నారు.



