ప్రతి వ్యక్తి తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి

  • : మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రాములు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజ పుల్లారెడ్డి

 విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని రంగంపల్లి, జీడి గడ్డ తండా, మల్కాయ్ పెట్, ఇబ్రహీంపూర్, హిర్యా నాయక్ తండ, గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు, మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బద్రి గారి రాజ పుల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి వ్యక్తి తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు అయ్యేవిధంగా ఆయా గ్రామాల్లోని బి ఎల్ ఎ, బి ఎల్ వో లు దగ్గరుండి చేయించాలని తెలిపారు. ఎస్ ఐ ఆర్ ఫామ్ లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఓటర్ లిస్టులో ఓటర్ పేరు నమోదు కావాలంటే బీఎల్ఏ లు పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడే 100% ఓటర్ నమోదు కార్యక్రమం పూర్తి కావడం జరుగుతుందని పేర్కొన్నారు. బి ఎల్ ఏ ల బాధ్యత ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సూపర్వైజర్ యాదయ్య, బి ఎల్ ఏ లు గోపాల్, రమేష్, వీరారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-person-should-register-their-name-in-the-voter-list/article-19566

Tags: