ఉద్యమకారుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

ఉద్యమకారుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమకారుల సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఐక్యంగా పనిచేస్తే ఉద్యమకారుల సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుందని,  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అన్ని సంఘాల అభిప్రాయాలు, సూచనలతో కూడిన సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ డాక్టర్ సీమ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం సాయంత్రం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్రాధ్యక్షులు చీమ సీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఉద్యమకారుల సంఘాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉద్యమకారుల సమస్యలు, డిమాండ్లు, సూచనలను సమగ్రంగా అందించి నివేదికను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఉద్యమకారుల ప్రయోజనాల పరిరక్షణే అందరి లక్ష్యమని, ప్రభుత్వం లేదా కమిటీని విమర్శించడం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమకారుల హక్కులు, గుర్తింపు అంశాల్లో అన్ని సంఘాలు ఐక్యంగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘాల నాయకులు కరుణాకర్ రెడ్డి, నాగరాజు, నవీన్ కుమార్, భూపాల్, ఆనంద్, సుదర్శన్, బాలయ్య, అన్వర్ పటేల్, వెంకటరత్నం, మల్లయ్య, పూస నరసింహ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-solution-of-the-problems-is-only-with-the-unity/article-19570

Tags: