నీట్  పేపర్ లీకేజీ పై కాంగ్రెస్ పార్టీ నిరసన

విశ్వంభర, హాలియా:  నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా పీసీసీ పిలుపుమేరకు,  నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి  ఆదేశాల మేరకు అనుముల మండల కేంద్రంలో హాలియా సెంటర్ వద్ద  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నాయకులు నినాదాలు చేశారు. అలాగే, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తూ, కాంగ్రెస్ నాయకుడు గౌరవ శ్రీ రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధ చర్యగా పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాకునూరి నారాయణ గౌడ్, కుందూరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనుమల మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ యాదవ్, ఆలియా టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పొదిల కృష్ణ, కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-party-protest-over-neet-paper-leakage/article-19568

Tags: