రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విశ్వంభర, అనంతగిరి: కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల తమ్మరబండ పాలెం గ్రామానికి చెందిన దుద్దిరికి యల్లయ్య అనే వ్యక్తి వృత్తి రీత్యా డ్రైవర్ కాగా ఈ క్రమంలో ఎల్లయ్య తన తల్లి ని కోదాడ ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చేందుకు గురువారం అర్ధరాత్రి సమయంలో తన ఫల్సర్ బండి పై తన స్వగ్రామమైన తమ్మర బండ పాలెం నుండి బయలుదేరి కోదాడ వెళుతుండగా మార్గమధ్యలో శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లేసరికి ఆ సమయంలో ఆ ఫంక్షన్ హాల్ నుండి బయటికి వస్తున్న కారును డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ ఒక్కసారిగా యల్లయ్య నడుపుతున్న బండిని ఢీకొట్టగా యల్లయ్య తలకి బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడు యల్లయ్య భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.