గంగపుత్రుల  సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం  కట్టుబడి ఉంది

  • * జిల్లాస్థాయి మత్స్య ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 
    * మత్స్యకారుల కుటుంబాలకు బీమా సౌకర్యం 
    * మత్స్యకారుల వృత్తి నిమిత్తం రాయితీ పై పరికరాలు 
    * నిజామాబాద్ జిల్లాలోనే చేప పిల్లల పెంపకం చేసేలా చర్యలు 
    * అందరికీ ఆమోదయోగ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

విశ్వంభర, నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా రైతు వారోత్సవాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాస్థాయి మత్స్య శాఖ ప్రగతి , ప్రణాళిక సమావేశాన్ని శుక్రవారం నగరంలోని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి,  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వారి శాఖ ద్వారా మత్స్యకారుల కోసం చేపట్టిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధులు పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారులకు బీమా సౌకర్యం, రాయితీ పై వాహనాలు, సంఘ భవనంతో పాటు జిల్లాకు గంగపుత్ర సంఘం కార్పొరేషన్ చైర్మన్ ను కేటాయించాలని ఎమ్మెల్యేకు విన్నవించగా తప్పకుండా వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ… మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టాలే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని పేర్కొన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే అందజేయడం జరుగుతుందని అందుకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అదేవిధంగా అర్సపల్లి లో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని కాపాడటం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ భూమిని కాపాడే విధంగా జిల్లా అధికారుల చొరవ తో ప్రహరీ నిర్మాణం చేపట్టడం తో పాటు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి,మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ అధ్యక్షులు శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్, కిరణ్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న,ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-state-government-is-committed-to-the-welfare-of-the/article-15157

Tags: