బీసీలకు 42 శాతం రిజర్వేషన్ మాటల్లో మాత్రమేనా?

  • : పెరుమాండ్ల చరణ్ గౌడ్

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి షోకాజ్ నోటీసు లేకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పెరుమాండ్ల చరణ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ ,  ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి  అనేక సభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇస్తామని ప్రకటించారు. కానీ నేడు వాస్తవ పరిస్థితుల్లో మాత్రం బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీ యువతకు అవకాశాలు దక్కడం లేదు. పార్టీ కోసం కష్టపడిన అనుబంధ సంఘాల కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం బాధాకరమన్నారు. అందువల్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్  మీనాక్షి నటరాజన్ గారు వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని, బీసీ సమాజానికి న్యాయం చేయడంతో పాటు నా పై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని  విజ్ఞప్తి చేస్తున్నానన్నారు .

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/42-percent-reservation-for-bc-is-only-in-words/article-15134

Tags: