విద్య వ్యాపారం కాదు – సామాజిక బాధ్యతగా చూడాలి.
- ఎమ్మెల్సీ కోదండరాం
విశ్వంభర, హిమాయత్ నగర్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు కోదండరాం విద్యను వ్యాపార దృష్టితో కాకుండా సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. శనివారం హైదరాబాదు హిమాయత్ నగర్‌లో కెరీర్ పాయింట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. “మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో విద్యను లాభాపేక్షతో నడపడం సమాజానికి హానికరమని పేర్కొన్నారు. విద్య ద్వారా విలువలు, సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి వర్గానికి సమానంగా విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెరీర్ పాయింట్ నిర్వాహకులు పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హిమాయత్ నగర్ ప్రధాన రహదారిలో 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేతలు, విద్యావంతులు నర్సయ్య, సర్ధార్ వినోద్ కుమార్, ఆశప్ప, ధార సత్యం, పల్లె వినయ్, రాంచందర్, హనుమంత్ రెడ్డి, రసూల్ ఖాన్, గుమ్మడిదల శ్రీనివాస్, సుదేశ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.