హుస్నాబాద్‌లో ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు
- నకిలీ విత్తనాలు, అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు. రైతులకు నాణ్యమైన సన్న రకం వడ్ల విత్తనాలు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాల విక్రయం లేదా ఎరువులు,పురుగుమందులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ప్రతి షాపులో స్టాక్ బోర్డులను స్పష్టంగా ప్రదర్శించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ నిబంధనలను ఉల్లంఘించే డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.