పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి

  •  మైనార్టీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్‌కు వినతి

విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణలో పీర్ల పండుగ (మొహరం)ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరుతూ పీర్ల పండుగ (మొహరం) నిర్వాహకుల సంఘం నాయకులు మంగళవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ వక్ఫ్ కార్యాలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో "అసైదు సే భారతి కాళ్ల గజ్జల గమ్మతి" అనే పీర్ల పండుగ బాణీలోని పాట ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిందని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన "మా భూమి" చిత్రంలో కూడా పీర్ల పండుగ ప్రాముఖ్యతను, ప్రజల జీవితాలతో దాని అనుబంధాన్ని ప్రతిబింబించారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగతో సమానంగా పీర్ల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. మత సామరస్యానికి, సహోదర భావానికి, అమరత్వ స్ఫూర్తికి, పోరాట వారసత్వానికి పీర్ల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైన పీర్ల పండుగను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని, సంస్కృతిని విస్మరించినందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండున్నరేళ్ల కాలంలో పీర్ల పండుగకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల సంస్కృతిని గౌరవించడమేనని, అందువల్ల పీర్ల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించాలని మంత్రి అజారుద్దీన్‌ను కోరారు. అలాగే పీర్ల మాన్యాలను భూఆక్రమణదారుల నుంచి రక్షించి విముక్తి కల్పించాలని, పీర్ల చావిడీల మరమ్మతులు, నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.20 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pirla-festival-should-be-recognized-as-a-state-festival/article-16438

Tags: