రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కొందుర్గు– పరిగి ప్రాజెక్టుతో మేలు జరుగుతుంది :  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణకు ప్రభుత్వం రూ.587 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తాలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సంబరాలు నిర్వహించారు. అనంతరం  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మల్లు భట్టి విక్రమార్క,నీటిపారుదల  పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కోసం గతంలో తను ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని, ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించేందుకు తమ నాయకులను కూడా ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే పరిగి నియోజకవర్గంలోని దాదాపు 600  చెరువులను నింపుకునే అవకాశంకలుగుతుందని, రైతులు ఎక్కువ పంటలు పండించగలరని పేర్కొన్నారు.  బోర్లలో నీటి మట్టం పెరిగి భూగర్భ జలాలు పైకి వస్తాయని అన్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎవరికీ కూడా ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.రూ.587 కోట్ల నిధుల మంజూరుతో ప్రాంతీయ సాగునీటి అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, రైతాంగానికి ఇది ఎంతో మేలు చేసే నిర్ణయమని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, డిసిసి కార్యదర్శి పెంటయ్య, కౌన్సిలర్లు బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, ఎజాజ్, యూసఫ్, కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు తౌరియా నాయక్, కాంగ్రెస్ నాయకులు రాజపుల్లారెడ్డి, చిన్న నరసింహులు, జగన్, అన్వర్, నరేందర్, శ్రీనివాస్, బాల్రాజ్, తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-farmers-is-the-aim-of-the/article-15846

Tags: