కేంద్ర విద్యా శాఖ మంత్రిని తొలగించాలి  

  • సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ 

విశ్వంభర, మహబూబాబాద్ :  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న నీట్ పరీక్ష పేపర్ లీక్ కావటానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే మంత్రివర్గం నుంచి  తొలగించాలని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ  డిమాండ్ చేసింది .  ఈ సందర్భంగా సిపిఎంఎల్  మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి  కొత్తపెళ్లి రవి మాట్లాడుతూ , నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీఈఈటి) నీట్ 2025-26 పరీక్షకు   22 లక్షల 79 వేల మంది అప్లై చేశారని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ఉన్నత అధికారులు బాధ్యత మరిచి చూపిన నిర్లక్ష్యం వల్ల పరీక్ష రద్దయిందని అన్నారు . అనేక సంవత్సరాలనుండి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ,  వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల భవిష్యత్తు నమ్మకాలు ఈ పేపర్ లీకేజీ తో దెబ్బ తిన్నాయి. అనేకమంది తీవ్ర నిరుత్సాహానికి గురవటమే కాకుండా కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అని  ఆదర్శవంతమైన పాలన అని చెబుతున్న మోడీ ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ చేసిన అరెస్ట్ ఐన బీజేపీ నాయకులు దినేష్ బివాల్, మరికొందరు బిజెపి పార్టీలోనే కొనసాగుతూ ఉండటం రేపటి భవిష్యత్తు ప్రమాదాన్ని తెలియజేస్తుంది అని గుర్తు చేశారు . బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వహించిన అన్ని పరీక్షలలో 148 పరీక్షలలో కుంభకోణాలు జరిగినవి. 87 పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. సుమారు 9 కోట్ల మంది విద్యార్థులు ఈ అసమర్ధ పరిపాలన పరీక్ష నిర్వహణ తో మానసిక సంఘర్షణకు గురయ్యారు. కలగన్న ఆశలు నెరవేరయని నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారిలో 90 శాతం మంది హిందువులేనన్న విషయాన్ని గమనించాలని అన్నారు. 2024-25 లలో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని  విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టిoచుకోలేదని అన్నారు. మతాల మధ్య కులాల మధ్య మంటలు లేపి అధికారాన్ని కాపాడుకుంటున్న మోడీ ప్రభుత్వం అసలు రంగులు అర్థం చేసుకోవాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ధ్వంసం చేసే మోడీ ప్రభుత్వ విధానాలపై సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని  కొత్తపెళ్లి  రవి మీడియాకు  తెలిపారు .

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-union-education-minister-should-be-removed/article-15399

Tags: