గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లకు విశేష స్పందన
- మెరిట్ ఆధారంగా పారదర్శక కౌన్సిలింగ్ – 576 సీట్ల భర్తీ పూర్తి
- గిరిజన విద్యార్థినుల భవిష్యత్తుకు గురుకుల విద్య బంగారు బాట : ఐటీడీఏ పీఓ బి. రాహుల్
విశ్వంభర, భద్రాచలం: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ సీతాలక్ష్మి ఆదేశాల మేరకు ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాలికల అడ్మిషన్ కౌన్సిలింగ్‌ను అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించి విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గురుకుల విద్యాసంస్థలు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యకు బలమైన పునాది వేస్తున్నాయని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గురుకులాల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఆధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, పోటీ పరీక్షల కోచింగ్ వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ఐఐటీలు, నిట్‌లు, మెడికల్ కళాశాలలు మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారని వివరించారు. ఈ సంవత్సరం మొత్తం 576 సీట్లకు గాను పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా పూర్తిగా మెరిట్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థినుల సర్టిఫికెట్ల పరిశీలన, గ్రూపుల ఎంపిక, కళాశాలల కేటాయింపు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రతి విద్యార్థినికి అవకాశం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, ఏ సబ్జెక్టులో సీటు వచ్చినా విద్యార్థినులు దానిని అదృష్టంగా భావించి అడ్మిషన్ పొందాలని సూచించారు. కొంతమంది విద్యార్థినులు నిర్దిష్ట గ్రూపులపై ఆసక్తి చూపుతున్నప్పటికీ భవిష్యత్తులో అన్ని గ్రూపులకు సమాన అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులకు వివరించారు.
ఈ సందర్భంగా 561 మార్కులు సాధించిన శ్రీజకు మొదటగా అడ్మిషన్ ఫారం అందజేసి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం మెరిట్ జాబితా ప్రకారం వరుసగా విద్యార్థినులను పిలిచి సీట్ల కేటాయింపు చేపట్టారు. 395 మార్కుల వరకు సాధించిన విద్యార్థినులకు కూడా వివిధ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ సందర్భంగా విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా తాగునీరు, విశ్రాంతి గదులు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయగా, తల్లిదండ్రులకు కూడా పూర్తి వివరాలు తెలియజేసేలా సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. ఎటువంటి అవకతవకలు, అసౌకర్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం ముగిసిందని అధికారులు తెలిపారు. ఆర్సీఓ గురుకులం అరుణకుమారి పర్యవేక్షణలో మరియు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమన్వయంతో కౌన్సిలింగ్ విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, పోటీ పరీక్షల దిశగా ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల గిరిజన విద్యార్థుల భవిష్యత్తు మరింత उज్వలంగా మారుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఇతర కళాశాలల ప్రిన్సిపాళ్లు పుల్లమ్మ, రాణి, మాధవి లత, చైతన్య, ఇందిరా ప్రియదర్శిని, ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.