సింగారం గ్రామం లో  సీసీ కెమెరాలు ఏర్పాటు. -సర్పంచ్ నరేష్ .

విశ్వంభర, మహబూబాబాద్:-  మండలం సింగారం గ్రామంలో సర్పంచ్  దొంతర బోయిన  నరేష్ , ఉప సర్పంచ్ దర్శనం లక్ష్మణ్ ,  గ్రామస్తులతో కలిసి తన సొంత డబ్బులతో  సీసీ కెమెరాలు  ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ రూరల్ ఎస్సై  పి రాజు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ కార్యక్రమoని  ఉద్దేశించి గ్రామ  సర్పంచ్  దొంతర బోయిన నరేష్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కొరకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని , సీసీ కెమెరాల విలువ 20 వేల రూపాయల విలువ ఉందని  సర్పంచ్ అన్నారు . అనంతరం ఈ కార్యక్రమంలో  హాజరైన ఎస్సై పి .రాజు మాట్లాడుతూ  సింగారం గ్రామంలో   గ్రామ సర్పంచ్ నరేష్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని గ్రామస్తులంతా కలిసి పార్టీలకతీతంగా కులాలకతీతంగా సర్పంచికి సహకరించి గ్రామాన్ని అభివృద్ధి తీర్చి దిద్దుకోవాలని గ్రామస్తులను కోరారు . అనంతరం ఎస్సైని సర్పంచి మరియు గ్రామస్తులు కలిసి శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో    గ్రామస్తులు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

🕒 15 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/installation-of-cctv-cameras-in-singaram-village/article-15325

Tags: