మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబును కలిసిన చెల్లా మాధవరెడ్డి
విశ్వంభర, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించి మండల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెల్లా మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ను ఆయన చాంబర్లో కలిసి కోరారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ప్రభుత్వ భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరగా, మంత్రి శ్రీధర్ బాబు సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెల్లా మాధవరెడ్డి తెలిపారు.