ప్రపంచ రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం 

ప్రపంచ రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం 

  • అంతర్జాతీయ తలసీమియా దినోత్సవ వేడుకల్లో  పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య 

విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ రెడ్ క్రాస్ భవన్‌లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అంతర్జాతీయ తలసీమియా దినోత్సవ వేడుకలకు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ఎంపీ డా. కడియం కావ్య  ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించి అక్కడి వృద్ధులతో ముచ్చటిస్తూ, క్యారం బోర్డు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ తలసీమియా వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.  అంతర్జాతీయ తలసీమియా దినోత్సవం సందర్భంగా తలసీమియా బాధితులకు పండ్లు పంపిణీ చేసి, వారికి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి డా. కడియం కావ్య పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 20 మంది కార్మికులకు కిచెన్ సెట్లు, బ్లాంకెట్లను డా. కడియం కావ్య  పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య మాట్లాడుతూ, హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్తకేంద్రం, తలసీమియా కేంద్రం, జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సేవలు ఎల్లప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో రక్తకేంద్రాల్లో రక్త కొరత అధికంగా ఉంటుందని, అదే సమయంలో అనేక మంది రోగులు నిరంతరం రక్తంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తలసీమియా, సికిల్ సెల్వ్యాధులతోబాధపడుతున్న వారికి తరచూ రక్త మార్పిడి అవసరమవుతుందని, వారికి రక్తం కేవలం అవసరం మాత్రమే కాకుండా ప్రాణాధారమని అన్నారు.ఈ నేపథ్యంలో యువత, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త కొరత లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హనుమకొండ రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా తాను రెడ్ క్రాస్ సభ్యత్వం స్వీకరించి సంస్థ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్యను రెడ్ క్రాస్ పాలకవర్గం రెడ్ క్రాస్ క్యాప్, శాలువా, షీల్డ్‌లతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణా రెడ్డి, భూపాలపల్లి రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, డెమో అశోక్ రెడ్డి, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రామ్ అధికారిణి డాక్టర్ రుబీనా అఫ్రోజ్, రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-services-of-the-world-red-cross-are-appreciated/article-15130

Tags: