యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

  • మెగా జాబ్ మేళాలో  పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య 

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు ల తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.  ఈ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన 72 ప్రముఖ కంపెనీల స్టాల్స్ ను ఎంపీ సందర్శించారు. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ముందుకు రావడం సంతోషకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య  మాట్లాడుతూ,  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో గడ్డుకాలం నడుస్తోందన్నారు. టాలెంట్, హార్డ్‌వర్క్ ఉన్నప్పటికీ అనేక దేశాల్లో ఉద్యోగ భద్రత సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఉదయం లేచేసరికి ఉద్యోగం కోల్పోయామని తెలిసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో యువత నిరాశ చెందకుండా నిరంతరం తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. తాను కూడా ప్రైవేట్ రంగంలో డాక్టర్‌గా పనిచేసి, అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నానని తెలిపారు..ఎంబీబీఎస్ చదివిన కారణంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు, దేశవ్యాప్తంగా అమలు చేసే విధానాలపై లోతైన అవగాహన ఏర్పడిందన్నారు. ఒక బిల్లును ప్రవేశపెట్టే ముందు అనేక కోణాల్లో చదివి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా మన్నారు. విద్యార్థి దశ ముగిసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ “నిత్య విద్యార్థి”గా ఉండాలని, నిరంతరం చదువుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలరని అన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఎదుగుదల కోసం చదువు ఆగకూడదని, “రాయిని పదును పెడితేనే డైమండ్ అవుతుంది” అంటూ యువతలో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రస్తుతం యువతకు ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఎంతో ముఖ్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. “ప్రపంచంతో యుద్ధం చేస్తే అలెగ్జాండర్.. నీతో నువ్వు యుద్ధం చేస్తే బుద్ధుడు” అనే వ్యాఖ్యను ఉదహరిస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిరోజూ మెడిటేషన్, పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకుంటే మానసికంగా దృఢంగా మారి భవిష్యత్తులో విజయాలు సాధించగలరని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ ఆగకూడదన్నారు. ఒక ఉద్యోగం రాకపోతే మరో అవకాశానికి సిద్ధంగా ఉండే ధైర్యం యువతలో ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్టార్టప్స్, వ్యాపారాలు, ప్రైవేట్ రంగం, ఇతర ఉపాధి అవకాశాల వైపు కూడా యువత ఆలోచించాలని సూచించారు. జాబ్ మేళాకు హాజరైన ప్రతి యువకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ లక్ష్యాలను సాధించే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-aim-of-the-government-is-to-provide-employment-opportunities/article-15128

Tags: