కాంగ్రెస్ ప్రజాపాలనలో క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు.

  విశ్వంభర,కుత్బుల్లాపూర్ :-  నియోజకవర్గం లోని గాజులరామారంలో సి ఒన్ చర్చి లో క్రిస్టియన్ మైనార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రివైవల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైస్తవ మతానికి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని అలాగే క్రైస్తవ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు మద్దతు తెలుపుతూ ఉందని అన్నారు. గతంలో అసెంబ్లీ, లోక్ సభ , మున్సిపల్, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికలలో  క్రైస్తవ మతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి వారిని గెలిపించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి, బట్టి విక్రమార్కకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. క్రైస్తవ మత మహిళలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందిస్తున్నారని, క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు నిధులను అందజేస్తున్నారని, ప్రత్యేకంగా హెచ్ ఎం డి ఏ లో క్రైస్తవ స్మశాన వాటిక కొరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  పరిపాలన లోనే మాకు స్మశానవాటికను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.  ఈ కార్యక్రమంలో
ప్రెసిడెంట్ రెవరెండ్ గౌడి శేఖర్ ,సెక్రటరీ బిషప్  శామ్యూల్ ,ట్రెజరర్ పాస్టర్ దయానిధి , కోఆర్డినేటర్ రవికుమార్ ,
 వివిధ కాలనీల నుండి చర్చి పాస్టర్లు ,తదితరులు పాల్గొన్నారు

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/many-welfare-schemes-for-christians-under-congress-regime/article-15200

Tags: