పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం
విశ్వంభర, చింతపల్లి: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం చింతపల్లి మండలంలోని హరిజనాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స, చుడి పరీక్షలు, దూడలకు నట్టల నివారణ కార్యక్రమం, జనరల్ హెల్త్ చెకప్ ఉచితంగా వైద్యం చేశారు. రైతులకు వేసవికాలంలో పశువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మండల పశువైద్య అధికారి డా.భాను కిరణ్ వివరించారు. ఈ కార్యక్రమంలో హరిజనాపురం సర్పంచ్ తంగెళ్ల రామకృష్ణ, ఉపసర్పంచ్ లక్ష్మయ్య, వార్డ్ మెంబర్లు, రైతులు పశుసంవర్ధక శాఖ సిబ్బంది కీర్తి రాహుల్, గోపాలమిత్ర శంకర్, వెంకటేష్, పశు మైత్రి కృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.