సరూర్ నగర్ లో ఓ ఇంట్లో అనుమానాస్పద పేలుళ్లు.

- పేలుళ్లదాటికి   వంట గది కూలి వస్తువులంతా చిందర వందర.

విశ్వంభర, సరూర్ నగర్ : మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ బాపు నగర్ లోని ఓ ఇంట్లో అనుమానాస్పద పేలుడు  సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆ పేలుడు దాటికి వంటగది గోడ కూలడంతో పాటు, వస్తువులన్నీ చిందరవందరిగా పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే  దేవరశెట్టి దేవేందర్ 1993 లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. 2007లో పేలుడు జరిగిన పై అంతస్తును రేనివేషన్ చేశారు. కుటుంబ సభ్యులు ఉదయము అల్పాహారం చేసుకుని హాల్లో కూర్చున్నారు. వెంటనే ఏమి జరిగిందో కానీ పేలుళ్లు దాటికి  పక్క రూములోని షో గ్లాస్, కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు క్లూస్ టీమ్ ను పిలిపించి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులతోపాటు ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది వచ్చి పరిశీలిస్తున్నారు. పేలుళ్లు అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/suspicious-explosions-in-a-house-in-sarur-nagar/article-17318

Tags: