అభివృద్ధే ధ్యేయంగా మున్సిపల్ పాలక వర్గం పనిచేయాలి

అభివృద్ధే ధ్యేయంగా మున్సిపల్ పాలక వర్గం పనిచేయాలి

  • సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీనాయక్

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్లకు  మహబూబాబాద్  పట్టణ కేంద్రంలో ఉన్న పీ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమంలో  ఎమ్మెల్యే మురళీనాయక్  పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేసిన  ముఖ్య మంత్రి రేవంత రెడ్డి, ప్రభుత్వ సలహా దారు వేం నరేందర్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వేళ పార్టీలు.. ఎన్నికల తర్వాత పార్టీల కు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో బాగాస్వాములు కావాలని కోరారు. ఎన్నిరోజులు మున్సిపాలిటీలో ఎలా ఉందో అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మాత్రం మానుకోట మున్సిపాలిటీ తెలంగాణలో ఒక మంచి మున్సిపాలిటీగా పేరు రావాలని, అభివృద్ధిలో కూడా ముందు ఉండాలని,  దీనికి ప్రతి కౌన్సిలర్ బాధ్యత యుతంగా పనిచేయాలని, ప్రజా అవసరాల దృష్ట పని చేయాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్,వైస్ ఛైర్మన్  సూర్నపు సోమయ్య, కౌన్సిలర్లు ,మున్సిపల్ శాఖ అధికారులు,పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: