ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

విశ్వంభర, మహబూబాబాద్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా సోమవారం చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సమావేశం జరిగినది. ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరపాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్ మదార్ గౌడ్ అన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరుగుతాయని అన్నారు.  మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం విద్యార్థులు 4158, రెండో సంవత్సరం విద్యార్థులు 4129,  మొత్తం 8287 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని  చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కోరారు.

Tags: