గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

 విశ్వంభర, నాగారం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జిల్లానాగారం మండల పరిధిలోని పసునూరు గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ భవనాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెరగడానికి గ్రామ పంచాయతీ భవనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక వసతులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి మాజీ వార్డ్ మెంబర్ సభ్యులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మందుల సామేలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోతహసీల్దార్ హరికిశోర్ శర్మ, బాబురావు, ఎంపీడీవో భీమ్ సింగ్, మండల పార్టీ అధ్యక్షులు తోడుసు లింగయ్య, ఆకుల బుచ్చిబాబు, అంజయ్య, సర్పంచ్ కమటం సునీతా శ్రీనివాస్, బుక్క శ్రీను, మంజుల, పంది శ్రీను, వెంకటాబిక్షం, భయ్యం వెంకన్న, ఎలమకంటి సోమయ్య, వలి, ఉపసర్పంచ్ గోపి,. గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటయ్య, కార్యదర్శి బాబా , తదితరులు పాల్గొన్నారు

Tags: