ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై ఫిర్యాదు

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై ఫిర్యాదు

విశ్వంభర , త్రిపురారం: త్రిపురారం మండలం పెద్దదేవుల పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులలో అవినీతి, అవకతవకలకు పాల్పడుతున్న గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ , టెక్నీకల్ అసిస్టెంట్ లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు  బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొప్పు సోమయ్య వినతిపత్రం అందజేశారు.  పెద్దదేవులపల్లి గ్రామంలో నిపేదలకు ఉపయోగ పడాల్సిన పనిని, వారి స్వార్థం కోసం కమిషన్ల కోసం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నీకల్ అసిస్టెంట్ లు ఉపయోగించుకుంటున్నారని, పనులకు వెళ్ళని వారి సంతకాలు పెట్టించుకోని కమీషన్ మీద నగదు జమ అయ్యే విదంగా చేస్తున్నారని అన్నారు. అసలు మొదలు పెట్టని పనులు  పూర్తి ఐనట్టు తప్పుడు ఆధారాలు సృష్టించి బిల్లు లు తీ సుకుంటున్నారని, తప్పుడు కొలతలతో అవకతవకలకు పాల్పడుతున్నారని, పెద్దదేవుల పల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నీకల్ అసిస్టెంట్ లను గ్రామ ప్రజల మధ్య  విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని   త్రిపురారం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి కొప్పు సోమయ్య, జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న  డిమాండు చేశారు. విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు.

Tags: