ఇసుక లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

ఇసుక లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

 విశ్వంభర, ఏటూరు నాగారం:  ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. రాంనగర్ గ్రామానికి చెందిన గొర్లపల్లి నవీన్(39) ఇసుక లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం మేడారానికి వెళ్లి వనదేవతలను  నవీన్ దర్శించుకున్నాడు.  అనంతరం బంధువులను ట్రాక్టర్లో స్వగ్రామానికి పంపించాడు. తాను ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. తాడ్వాయి దాటిన తర్వాత కామారం క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై వెనుక నుండి వేగంగా వచ్చిన ఇసుక లారీ అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ లారీ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు భార్య,ఇద్దరు  కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: