అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు

  విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామంలో న్యూ వరుణ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో  యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందిన వెంటనే మండల వ్యవసాయ అధికారిణి అంజనీదేవి సంబంధిత దుకాణం వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. యూరియా అమ్మకపు ధర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి దుకాణం యజమానితో మాట్లాడి యూరియాను గరిష్ట రిటైల్ ధరకే విక్రయించాలని ఆదేశించారు.  అధిక ధరకు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో అరూర్ ఏఈఓ రమేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: