పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం

పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం

విశ్వంభర, సిద్దిపేట: నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. క్రీడలు సిబ్బందిలో స్ఫూర్తిని నింపుతాయని, మైదానంలో ఆడే శారీరక క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని చెప్పారు. కమిషనరేట్ లోని పెరేడ్ మైదానంలో పోలీస్ వార్షిక క్రీడా పోటీలను సీపీ రష్మీ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. అధికారులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులు కావొద్దని సూచించారు. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షిస్తూ, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవల జరిగిన రాష్ట్ర పోలీస్ క్రీడల్లో సిద్దిపేట పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారని కమిషనర్ ప్రశంసించారు. పోటీల్లో 3 బంగారు, 2 వెండి, 7కాంస్య, మొత్తం 12 పతకాలను సాధించి కమిషనరేట్ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: