గ్రంథాలయం ఏర్పాటుకు వినతి
On
విశ్వంభర, నాగారం: నాగారం మండల కేంద్రంలోని ఫణిగిరి గ్రామపంచాయతీలో గ్రంథాలయం ఏర్పాటు కోసం సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ కు సోమవారం ఫణిగిరి గ్రామ సమగ్ర అభివృద్ధి వేదిక ఎన్జీవో అధ్యక్షులు, ఫణిగిరి గ్రామ మాజీ సర్పంచ్ గట్టు నర్సింహారావు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి గ్రంథాలయం ఏర్పాటు కోసం ర్యాక్స్, ఫర్నిచర్, బుక్స్, మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫణిగిరి గ్రామ సమగ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి మాజీ ఉపసర్పంచ్ ఎర్ర నరేష్,మాజీ వార్డ్ మెంబర్ కడారి పద్మయ్య, యూత్ నాయకులు ఎర్ర అజయ్,ఎర్ర మధు,తదితరులు పాల్గొన్నారు.



