డంపింగ్ యార్డ్‌ను తరలించాలి 

డంపింగ్ యార్డ్‌ను తరలించాలి 

 విశ్వంభర, మేడ్చల్:  ఎస్‌పీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం  సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను తక్షణమే అనుకూల ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేస్తూ  జర్నలిజం విభాగం  ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతినిధుల బృందం సోమవారం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో  టి. లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతంలో డంపింగ్  యార్డ్ కారణంగా తీవ్ర దుర్వాసన, వాయు కాలుష్యం, దోమలు, వ్యాధికారక పరిస్థితులు నెలకొంటున్నాయని, విద్యార్థుల ఆరోగ్యానికి, విద్యావాతావరణానికి  ముప్పుగా మారిందని తెలిపారు. విశ్వవిద్యాలయం సమీపంలో చెత్త నిల్వ చేయడం పర్యావరణ, ప్రజారోగ్య ప్రమాణాలకు విరుద్ధమని, సమస్యను తక్షణమే పరిష్కరించడం మున్సిపల్ అధికారుల బాధ్యత అని అన్నారు.  పర్యావరణ ప్రమాణాలకు అనుగుణమైన ప్రాంతానికి తరలించాలని  కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషనర్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమములో రామకృష్ణారెడ్డి, కేశవమూర్తి, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags: