మతసామరస్యానికి  హజ్రత్ అబ్బాస్ దర్గా ప్రతీక

మతసామరస్యానికి  హజ్రత్ అబ్బాస్ దర్గా ప్రతీక

విశ్వంభర, చింతపల్లి: మతసామరస్యానికి ప్రతీక హజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ ఉరుసు ఉత్సవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.  రెండు రోజుల నుండి మండల పరిధిలోని పీకే మల్లేపల్లి గ్రామంలో కొనసాగుతున్న  హజరత్ అబ్బాస్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సోమవారం పల్లా వెంకట్ రెడ్డి, నెల్లికంటి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ఆధ్వర్యంలో దర్గా ముత్తవల్లి మహమ్మద్ చాంద్ పాషా, యూసుఫ్ పాషా వారికి ఘన స్వాగతం పలికి పూలమాల, శాలువలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ కుల, మతాలకతీతంగా సామరస్య పూర్వక వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలన్నారు. సమాజంలో భేదభిప్రాయాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరు పరమత సహనం చాటుతూ ఐక్యమత్యంతో ముందుకెళ్లాలన్నారు. ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘటించారు. దర్గా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్సీ సత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీపీఐ  సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీపీఐ  మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఉజ్జిని అంజల్ రావ్, నాయకులు వేముల బుచ్చయ్య, చేపూరి వెంకటయ్య, గనిపల్లి రాములు, సైదులు, మల్లయ్య, రామకృష్ణ, అబ్బయ్య, బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: