టాలెంట్ టెస్ట్ జిల్లా విజేత సింగరం దీక్షిత్
విశ్వంభర,నెల్లికుదురు: ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో నెల్లికుదురు మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి సింగరం దీక్షిత్ అసాధారణ ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ విజేతగా నిలిచాడు. ఎఫ్ పీఎస్ టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ మహబూబాబాద్ లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో 18 మండలాలకు చెందిన మండల టీఓపీ విజేతలు పాల్గొనగా.. దీక్షిత్ ఫస్ట్ ప్రైజ్ కైవసం చేసుకొని ప్రముఖులచే బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు.దీంతో ఎంఈఓ రాందాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి. ఉపేందర్రావు,హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో సైతం నెల్లికుదురు కీర్తి రాణించేలా టాలెంట్ కనబరచాలని ఆకాంక్షించారు. గైడ్ టీచర్లు బేతమల్ల బిక్షపతి, జ్యోతిల కృషిని, ప్రోత్సాహాన్ని కొనియాడారు.దీక్షిత్ తల్లిదండ్రులుసింగరం ప్రసాద్ -స్వర్ణలత దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహంతో తమ కుమారుడు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచాడన్నారు.



