విద్యాభివృద్ధికి భూదానం చేయడం అభినందనీయం
విశ్వంభర,నెల్లికుదురు: గిరిజన తండాలో విద్యా వికాసం కోసం భూదానం చేసిన దాతలను వారిని స్మరిస్తూ వారి వారసులు శిలాఫలకం ఏర్పాటు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం దుర్గాభవాని తండాలో చోటుచేసుకుంది. తండాలో విద్యాభివృద్ధి కోసం 1996లో గుగులోతు భోజ్య కీరి దంపతులు 10 గుంటల భూమిని దానం చేశారు. వీరితోపాటు గుగులోతుకిష్టు,భీమ్లా,రాంధన్ జ్ఞాపకార్థంగా భోజ్య మనుమలు నవీన్, కిమ్లా, శ్రీను, రామచందర్,జగన్,సుమన్ లు సంబంధిత పాఠశాల ఆవరణంలో శిలాఫలకం ఏర్పాటు చేయగా.. ఎంఈఓ రాందాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం భూదానం చేయడం అభినందనీయమని కొమియాడారు. అంతకుముందు పాఠశాల హెచ్ఎం శ్రీదేవితో కలిసి అంగన్వాడి సెంటర్ కు నవీన్ ప్రెజర్ కుక్కర్ బహుకరించారు. కార్యక్రమంలో సర్పంచి వీరన్న,డిసిసి ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్,మాజీ సర్పంచి కొమ్ము అనిల్, పరిపాటి వెంకటరెడ్డి,గూగులోతు రాము,శంకర్,భూక్యవీరన్న,వడ్లకొండ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.



