ఘనంగా మాజీ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు
On
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో అభిమానులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 డివిజన్లోని వివిధ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, ఐమాక్స్ లైట్లు, మంచినీటి పైప్లైన్ల వంటి అనేక సమస్యలను తీర్చి డివిజన్ని అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి అనిత యాదిగిరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గోపురాములు,నానాజీ,సదానంద్, శ్రీను, శంకర్, భగవాన్ పాశం మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.



