పసికందును హత్య చేసిన నిందితులను శిక్షించాలి: ఐద్వా
On
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా కుల దురహంకారంతో రెండు నెలల పసికందును హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద జరిగిన నిరసనలో వారు మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో ఘటన జరిగినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.



