27 నుంచి బ్రహ్మోత్సవాలు: సిద్ధాంతి పార్థసారథి 

27 నుంచి బ్రహ్మోత్సవాలు: సిద్ధాంతి పార్థసారథి 

విశ్వంబర, పరిగి : పట్టణంలో బాలాజీ నగర్లో   శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 వ తేదీ నుంచి  మార్చి 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు  ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధాంతి పార్థసారథి మాట్లాడుతూ.. ఈనెల 27వ తేదీన సుదర్శన యాగము, 28వ తేదీన  శ్రీ చండీ హోమము, మార్చి 1న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా  నిర్వహించనున్నట్లు తెలిపారు.   బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరవుతారని అన్నారు. పరిగి నియోజకవర్గంలోని ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపను పొందాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

Tags: