కాంగ్రెస్ పార్టీలో చేరిక 

కాంగ్రెస్ పార్టీలో చేరిక 

విశ్వంభర, పరిగి : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చౌడపూర్ మండల పరిధిలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్, సర్పంచ్ కవిత హరినాథ్, ఏఎంసి చైర్మన్ వాలీబాయ్, వెంకట్, రాములు, అనంతరెడ్డి, రామారావు, నూర్య నాయక్, సంతోష్, లాలు, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

Tags: