సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

  •  ఎస్పి నరసింహ   

 విశ్వంభర, సూర్యాపేట:  మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పట్టణంలోని త్రివేణి పంక్షన్ హల్ లో జిల్లా ఎస్పీ నరసింహ  సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. బందోబస్తు విధులలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు.  విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన విధులు, ప్రాంతాలు వదలవద్ద ని చెప్పారు.  పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్దతిలో ఉంచాలి, అనుమతిలేని వ్యక్తులను పరిసరాల్లో రానివ్వ రాదని , 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలి అన్నారు. ఓటర్లు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తులు ఏమైనా  వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలి అన్నారు. ఎన్నికల సామాగ్రి తరలించడంలో రూట్ మొబైల్ పోలీసు సిబ్బంది విధులు ముఖ్యమైనవని  అన్నారు ఎన్నికల సామాగ్రికి పూర్తి భద్రత కల్పిస్తూ పోలింగ్ సామగ్రిని పోలింగ్ బూత్ లకు చేర్చడం, స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడంలో అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా, ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా గొడవలు పడినా, గుంపులుగా చేరినా సంభందిత స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందికి, రూట్ మొబైల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.  ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్  ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత అనేది ఒక సమష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ  కోరారు. ఈ సమావేశంలో  అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్, సి ఐ లు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, శివకుమార్, ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లు, ఏఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: