ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టాలని వినతి
విశ్వంభర, నాగారం: ఆఫీసులు అన్ని నాగారం గ్రామంలోనే నిర్మాణం చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ, యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మండల నాయకులు చిప్పలపల్లి నాగార్జున మాట్లాడుతూ నాగారం రెవెన్యూ శివారులో సర్వేనెంబర్.172,176,45,428 లలో ప్రభుత్వ భూమి కలదని, దాతలు సర్వే నెంబర్లు; 441,49,184 స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సర్వేయర్ వచ్చి సర్వే చేసి ఎంపీడీవో, ఎమ్మార్వో, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సేకరించి వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. .కలెక్టర్ స్పందిస్తూ నాగారం రెవెన్యూ శివారులోనే మండల కార్యాలయాలు నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు విజయరామరాజు, మండల నాయకుడు చిప్పలపల్లి నాగార్జున, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దేవరకొండ మురళి,శ్రీకృష్ణ యువజన సంఘం నాయకులు కన్నబోయిన లింగరాజు యాదవ్, గీతాంజలి యువజన సంఘం నాయకులు అనంతల సోమేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు చిప్పలపల్లి పండు,నవతరం యువజన సంఘం నాయకులు పవన్, శివకుమార్ ,క్లింటన్, క్రాంతి యువజన సంఘం నాయకులు చిప్పలపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



