సీతారామచంద్రస్వామి కల్యాణానికి  ఏర్పాట్లు

సీతారామచంద్రస్వామి కల్యాణానికి  ఏర్పాట్లు

 విశ్వంభర,  భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం లో వచ్చే నెల 27, 28 తేదీలలో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి  కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల కోసం సిద్ధమవుతోంది. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో  మహోత్సవాల నిర్వహణపై జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఏర్పాట్ల పురోగతిని మీక్షించేందుకు ఈ నెల 24న  మధ్యాహ్నం 3 గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags: