డెంగ్యూ పై అప్రమత్తంగా ఉండాలి

డెంగ్యూ పై అప్రమత్తంగా ఉండాలి

  • జిల్లా మలేరియా అధికారి  రజిని 

విశ్వంభర, హనుమకొండ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు ఆదేశానుసారం సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల నజీకేత్ పురం లో నమోదైన డెంగ్యూ బాధితుడి ఇంటిని వరంగల్ జిల్లా మలేరియా అధికారి  కె. రజిని, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఈదురు అనిల్ కుమార్ వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్నారు. ఇంటి పరిసరాలను పరిశీలించి డెంగ్యూ వ్యాధి పట్ల జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా మలేరియా అధికారి  కే .రజిని మాట్లాడుతూ,  ఇంటి చుట్టుపక్కల నీరు నిలువ ఉండకుండా చూడాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న  యాంటీ లార్వెల్ ఆపరేషన్ పరిశీలించి తగు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటి  సర్వే నిర్వహించి, జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఈదురు అనిల్ కుమార్ మాట్లాడుతూ,  ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా వ్యాధుల బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య విస్తరణ అధికారులు  సదానందం, విజయేంద్ర కుమార్, మున్సిపల్ హెల్త్ సూపర్వైజర్ మధుకర్, సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: